రాయలసీమ పౌరుషంపై వ్యాఖ్యలు రాజుకున్న రాజకీయ దుమారం
- కేతిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు స్పందన- బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్తాడిపత్రి, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):రాయలసీమ ప్రజల పౌరుషంపై మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని ఆయన...