హనుమాన్ దేవాలయం పవిత్రతను దెబ్బతీసేలా మురుగు కాలువ నిర్మాణం చంద్రంపేట ప్రజల ఆగ్రహం

మనప్రజాప్రతినిధిరాజన్న సిరిసిల్లజనవరి, 08 స్థానిక జ్యోతినగర్‌లోని చారిత్రాత్మక హనుమాన్ దేవాలయం వెనుక భాగంలో నిర్మిస్తున్న మురుగు కాలువ వివాదాస్పదంగా మారింది. ఆలయ గోడను ఆనుకొని, ఊరిలోని మురికి నీరంతా దేవాలయం పక్కనుంచే వెళ్లేలా అధికారులు చేపట్టిన ఈ నిర్మాణాలపై భక్తులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.గత 40 ఏళ్లుగా ఉన్న పాత కాలువను వదిలేసి, ఇప్పుడు కావాలనే దేవాలయానికి ఆనుకొని మురుగు కాలువను నిర్మించడం ఆలయ పవిత్రతను దెబ్బతీయడమేనని భక్తులు ఆరోపిస్తున్నారు.హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఈ నిర్మాణాలు చేపట్టడం వెనుక...