•10లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి4
కొండపాక మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు సరైన రోడ్డు సదుపాయం లేక ఎస్సీ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.