దేశ సంస్కృతి పరిరక్షణకు సిపిఐ పిలుపు

సదాశివపేటలో ముగ్గుల పోటీలు-విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సిపిఐ నాయకులు.సదాశివపేట,జనవరి11(మనప్రజాప్రతినిధి):భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో సదాశివపేట సిపిఐ పట్టణ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన పురం రమాదేవి, కటకం సప్న చేతుల మీదుగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజద్దీన్ మాట్లాడుతూ, నేటి యువత భారతీయ సంస్కృతిని మరిచి ప్రపంచీకరణ ప్రభావంతో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ...