మట్టి మాఫియాపై చర్యలు తీసుకోకపోతే రోడ్డెక్కి ఆందోళన – సీపీఐ హెచ్చరిక

మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.జనవరి4రేణిగుంట మండలంలో మట్టి మాఫియా దాడుల నుంచి రెవెన్యూ అధికారులకు తక్షణమే రక్షణ కల్పించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, రేణిగుంట మండల కార్యదర్శి వైయస్ మణి పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నాయని ఆరోపించారు. అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై రేణిగుంట మండలంలో మట్టి...