క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ప్రారంభించిన కలెక్టర్ అఖిల్ యాదవ్, ప్రతాప్ రెడ్డికొండపాక,జనవరి8(మనప్రజాప్రతినిధి):కొండపాక గ్రామంలో అనంతుల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీపీ అనంతుల శారద స్మారకార్థం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు....