కొలనూర్ – రామన్నపేట కల్వర్టు పనులకు మోక్షం

•వర్షాకాల కష్టాలకు శాశ్వత పరిష్కారం: కొలనూర్–రామన్నపేట కల్వర్టులు•రూ.1.90 కోట్లతో రెండు వంతెనల నిర్మాణం•ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో నెరవేరిన దశాబ్దాల కలమనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి11వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం కొలనూర్, రామన్నపేట గ్రామస్థుల ఏళ్లనాటి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ప్రధాన అడ్డంకిగా మారిన కల్వర్టుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.రూ.1 కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు కల్వర్టుల పనులను ఆదివారం కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో...