పరశురామేశ్వర స్వామి సన్నిధిలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దర్శనం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్31ఏర్పేడు మండల పరిధిలోని ప్రాచీన క్షేత్రమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం బుధవారం భక్తుల కిటకిటలతో పునీతమైంది. త్రేతాయుగం నుంచి పూజలందుకుంటూ, అపార మహిమలు కలిగిన స్వయంభూ క్షేత్రంగా పేరొందిన ఈ దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. పరశురామేశ్వర స్వామి దర్శనం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, శాంతి–సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికుల విశ్వాసం.ఈ సందర్భంగా దేవాలయానికి సంబంధించిన నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ ఆనందవల్లి పరశురామేశ్వర స్వామి భక్తి ఛానల్” యూట్యూబ్ ఛానల్‌ను ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో, కార్యనిర్వహణ అధికారుల సమక్షంలో...