ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

రాజన్న సిరిసిల్ల, జనవరి2(మనప్రజాప్రతినిధి)జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత శుక్రవారం కోనరావుపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులు, అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రధానాంశాలు:గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఆరోగ్య పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని పర్యవేక్షించారు.కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ సురేష్ తో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.సాధారణ ప్రసవాలు (Normal Deliveries) సకాలంలో జరిగేలా,...