manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 1:15 pm Editor : Mana Praja Prathinidhi

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా DTF 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ<br>

మనప్రజాప్రతినిధి/వేములవాడ,
జనవరి ,05

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్లను సోమవారం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై జిల్లా నాయకత్వం ఆయనకు వినతిపత్రం సమర్పించింది.
ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు:
వినతిపత్రం అందజేసిన అనంతరం DTF ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన అంశాలు:
టెట్ మినహాయింపు: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న 6 డీఏ (DA)లను వెంటనే విడుదల చేయాలి మరియు నూతన పీఆర్సీ (PRC)ని తక్షణమే అమలు చేయాలి.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కోర్టు తీర్పు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి.విద్యా కమిషన్ సిఫార్సుల అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ మంజూరు, 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం.ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను: ఎమ్మెల్యేఉపాధ్యాయుల సమస్యలను సుమారు 20 నిమిషాల పాటు ఓపికగా విన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. విద్యారంగంపై ప్రభుత్వానికి ప్రత్యేక గౌరవం ఉందని, ఉపాధ్యాయుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో DTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అవురం సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బూర సదానందం, మాజీ అధ్యక్షుడు ఐల్నేని రాజేశ్వరరావు, దొంతుల శ్రీహరి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, చక్రపాణి, గణేష్, నిజానపు పర్షరాములు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దశరథం, సురేష్, మహేష్, వెంగల శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.