manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:29 am Editor : Mana Praja Prathinidhi

జిల్లా కలెక్టర్, సీపీ చేతుల మీదుగా దుద్దెడ శంభు దేవాలయ క్యాలెండర్ ఆవిష్కరణ

దుద్దెడ శంభు దేవాలయం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత.

శివ–పార్వతుల కల్యాణోత్సవానికి హాజరవుతామని కలెక్టర్, సీపీ హామీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న దుద్దెడ స్వయంభు ఆలయ బ్రహ్మోత్సవాలు

•ట్రస్ట్ సభ్యుల వినతికి సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారులు

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జనవరి12
దుద్దెడ స్వయంభు శంభు దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హేమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పేరుమాల్‌కు దేవాలయ ట్రస్ట్ సభ్యులు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా దేవాలయ వార్షిక క్యాలెండర్‌ను కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కు హాజరు కావాల్సిందిగా ట్రస్ట్ సభ్యులు అధికారులను ఆహ్వానించా రు.దీనికి స్పందించిన కలెక్టర్, సీపీలు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న శివ–పార్వతుల కల్యాణోత్సవానికి హాజరవుతామని సానుకూలంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ శివకుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్, కొండపాక మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, నాయకులు అనంతుల నరేందర్, ఆంజనేయులు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.