•జెండా ఆవిష్కరణతో దేశభక్తి ఉత్సాహం ఉవ్వెత్తున
•విద్యే ఆయుధంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం
•గణతంత్ర స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపిన సాయి కృప స్కూల్
•సాయికృప స్కూల్లో రాజ్యాంగస్ఫూర్తితో 77వ గణతంత్రవేడుకలు.
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జనవరి27
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండపాక మండలంలోని సాయి కృప స్కూల్లో నిర్వహించిన వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి. స్కూలు ప్రిన్సిపాల్ వనజ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత విద్య ప్రతి ఒక్కరి హక్కుగా మారిందని, ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు ద్వారా జీవితంలో వెలుగులు నింపే అవకాశం లభించిందని తెలిపారు.విద్యార్థులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనుహృదయపూర్వకంగా అనుసరించిదేశ భవిష్యత్తుకు పునాది బాటలువేయాలని పిలుపునిచ్చారు.గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ ఆటలు,సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులుఅందజేసి ఉత్సాహంనింపారు.ఈకార్యక్రమంలోమాజీ పీఏసీఎస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాంతారావు, వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, సాయి కృప అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంజా రమేష్ తదితరులు పాల్గొని వేడుకలకు మరింత శోభనిచ్చారు.