manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:43 pm Editor : Mana Praja Prathinidhi

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ

ఇల్లంతకుంటలో గణతంత్ర వేడుకలు సంచలనం
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి26
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మామిడి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంలో మామిడి రాజు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ జీవించాలి అని సూచించారు. ప్రజల సంకల్పం, ఐక్యత, అభ్యాసం, సమాజ సేవా భావనలను పెంపొందించడం గణతంత్ర వేడుకల ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.ఈ కార్యక్రమం స్థానికులలో స్ఫూర్తి.జాతీయ చైతన్యాన్ని పెంపొందించే దిశగా సాగింది.