గ్రామరుద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ
మునిపల్లి,జనవరి16(మనప్రజాప్రతినిధి):
అందోల్ నియోజకవర్గంలోని చిన్నచెల్మెడ గ్రామంలో శ్రీ దుర్గ భవాని మాత జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజల కోసం గ్రామానికి చెందిన రుద్ర కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా రుద్ర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, దుర్గ భవాని మాత ఆశీస్సులు పొందుతూ భక్తులు, గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మాత కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈ అన్నప్రసాద కార్యక్రమంలో రుద్ర దులప్ప, తుల్జరాం, అశోక్, రాములు, శేఖర్, అంబదాస్, సుధాకర్, నర్సింలు, రుద్ర శ్రీధర్, సాయిప్రభు, రుద్ర సాయి, వెంకటేష్, హేమంత్, గణేష్‌లతో పాటు గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.