జూనియర్ శివాయిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్–02కు ఘనముగింపు..
•క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం:రెండో వార్డుసభ్యులు కొత్తపల్లి గీతా నాగరాజుమెదక్ జిల్లా,జనవరి18(మనప్రజాప్రతినిధి)శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన జూనియర్ శివాయిపల్లి ప్రీమియర్ లీగ్ (JSPL) సీజన్–02 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. క్రీడాకారుల కోరిక మేరకు విన్నర్, రన్నర్ జట్లకు ట్రోఫీలు, వ్యక్తిగత బహుమతులను రెండో వార్డు సభ్యులు కొత్తపల్లి గీతా నాగరాజు అందజేశారు.ఈ సందర్భంగా కొత్తపల్లి గీతా నాగరాజు మాట్లాడుతూ, గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడు తుందని, యువత మొబైల్...