manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 6:18 pm Editor : Mana Praja Prathinidhi

ఇర్కోడ్‌లో శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణ మహోత్సవం – అంగరంగ వైభవంగా వెల్లివిరిసిన భక్తి శ్రద్ధలు

భక్తిశ్రద్ధలతో సాగిన కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన గ్రామ ప్రజలు

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి25
సిద్దిపేట మండలం రూరల్ పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఉన్న శ్రీ మల్లిఖార్జున దేవస్థానంలో ఆదివారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనుల పండుగగా వీక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సూడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డు సభ్యులు, ఒగ్గు కళాకారులు, వివిధ కుల సంఘాల నాయకులు, యూత్ లీడర్లు, గ్రామ ప్రజలు, భజన మండలి కళాకారులు పాల్గొన్నారు. అలాగే కొండాపూర్ గ్రామ సర్పంచ్ జిగిరి అమర్ కూడా హాజరై కార్యక్రమానికి శోభ చేకూర్చారు.కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ దైవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కంతుల తిరుపతి సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశారు.కళ్యాణం అనంతరం పట్నాల ఒగ్గు కళాకారులచే శ్రీ మల్లిఖార్జున స్వామి కథా గానం, సుంకు పట్టడం కార్యక్రమం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్జ్వలంగా నిలిపిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.