manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 1:32 pm Editor : Mana Praja Prathinidhi

మీడియా ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంది :తుడుం స్వామి.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.సిద్దిపేట జిల్లా.జనవరి8
నేడు ఖాజీపూర్ గ్రామంలో ఖాజీపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుడుం స్వామి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తోందని పేర్కొన్నారు.మన ప్రజా ప్రతినిధి డిజిటల్ డైలీ పేపర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ హితం కోసం పనిచేసే పత్రికలు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీసి పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.స్థానిక వార్తలకు ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతున్న మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మన ప్రజా ప్రతినిధి రిపోర్టర్ జి. మల్లేశం,నాయకు లు చిక్కుడు అంజయ్య, రాజు, రవి తదితరులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.