manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:49 pm Editor : Mana Praja Prathinidhi

భక్తిశ్రద్ధలతో స్వామి వారి దర్శనం-ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

•శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భరోసా
•స్వామి వారి దర్శనంతో ఆలయ అభివృద్ధికి నాంది
ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సానుకూల స్పందన

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.జనవరి22
శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానాన్ని పాణ్యం ఎమ్మెల్యే, మహిళా & శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ శ్రీచరితారెడ్డి, కావలి ఎమ్మెల్సీ శ్రీమతి గ్రీష్మలు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థాన విశిష్టతలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చైర్మన్ వివరించారు. ఆలయ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ప్రశంసించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, శ్రీ పరశురామేశ్వర స్వామి ఆశీస్సులతో దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సానుకూల స్పందనతో పాటు, స్వామి వారి దర్శనంతో అభివృద్ధికి నాంది పడిందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.