77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేత.
•పేదలు–ధనికుల మధ్య పెరుగుతున్న అంతరం,కార్పొరేట్ శక్తుల ఆధిపత్యంపై సీపీఐ నేతల ఘాటు విమర్శలుసదాశివపేట,జనవరి26(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయం ఎదుట 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలపై సీపీఐ నాయకులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి గణతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ పేదలు–ధనికుల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతూనే ఉందని విమర్శించారు. దేశ సంపద మొత్తం కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోయిందని, మోదీ పాలన అంతా వారి సంపద...