బీసీ భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ.జనవరి11మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్‌ను సంఘ అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ మాట్లాడుతూ, పద్మశాలి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల ఫలాలు పద్మశాలి కుల కుటుంబాలందరికీ అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన బీసీ బంధువులకు, పద్మశాలి కుటుంబ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి రావిరాల...