నిర్దేశిత గడువులోనే రోడ్ విస్తరణ పూర్తి చేయాలి

•నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశంగుంటూరు,జనవరి4(మనప్రజాప్రతినిధి):నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డును పరిశీలించి, జరుగుతున్న విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తిచేయడం అత్యంత ముఖ్యమన్నారు. పనులలో జాప్యం వల్ల ప్రజల రాకపోకలకు, చుట్టుపక్కల నివాసితులకు తీవ్ర అసౌకర్యం...