పుణ్యక్షేత్ర ప్రతిష్ఠకు భంగం-కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి8తిరుపతి జిల్లాలో, ముఖ్యంగా తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గమధ్యంలో గరుడ వారధి కింద జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది యువకులు బిక్షాటన పేరుతో తిరుపతి నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.గరుడ వారధి కింద కొంతమంది వృద్ధులు జీవనోపాధి కోసం బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, అదే ప్రాంతంలో కొంతమంది యువకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితిలో నివాస కుటీరాలు ఏర్పాటు...