manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:03 pm Editor : Mana Praja Prathinidhi

వినూత్న ఆవిష్కరణలతో విద్యార్థులను ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులు

ఎన్.శంకర్,మండల విద్యాధికారి,
సదాశివపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఆత్మకూర్, బాబిల్‌గాన్, కోనాపూర్, పెద్దాపూర్ మరియు ఏఎంఎస్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు బుధవారం దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన–2026ను సందర్శించా రని మండల విద్యాధికారి ఎన్. శంకర్ తెలిపారు.కొల్లూరు గాడియం క్యాంపస్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 19 నుండి 23 వరకు నిర్వహిస్తున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్–2026లో ఏర్పాటు చేసిన స్టాళ్లు వినూత్న ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథంతోరూపుదిద్దు కున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణలు, ప్రతిభను వెలికి తీసేందుకు ఈ సైన్స్ ఫెయిర్ అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు.ఈ సైన్స్ ఫెయిర్‌లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సింపోజియంలు, చర్చా వేదికలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు, నమూనాలు, ఆవిష్కరణల ద్వారా శాస్త్ర–సాంకేతికతపై అవగాహన పెంపొందించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సదాశివపేట మండలంలోని పాఠశాలల హెచ్‌ఎంలు నాగభూషణం, కృష్ణయ్య, రామ్ నర్సింహారెడ్డి, రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ స్టాఫ్, సీఆర్‌పీలు మరియు విద్యార్థులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్. శంకర్ తెలిపారు.