manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 10:20 am Editor : Mana Praja Prathinidhi

శివాయిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్–3 ఘన ముగింపు

సుప్రీమ్ టైగర్స్ పి.నవీన్ కుమార్‌కు”మాన్ ఆఫ్ ది సిరీస్,వికెట్ టేకర్ అవార్డులు

మనప్రజాప్రతినిధి//మెదక్.జనవరి16
మెదక్ జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన శివాయిపల్లి ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) సీజన్–3 గురువారం ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో నాలుగు జట్లు పాల్గొని ఉత్కంఠభరితంగా పోటీపడ్డాయి.సుప్రీమ్ టైగర్స్ జట్టుకు చెందిన పి. నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టోర్నమెంట్ మొత్తం మీద 145 పరుగులు చేయడంతో పాటు 17 వికెట్లు తీసి మాన్ ఆఫ్ ది సిరీస్ తో పాటు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు (వికెట్ టేకర్) బహుమతులను సొంతం చేసుకున్నారు.గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ స్ట్రైకర్స్ జట్టు అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌కు ముఖ్యదాతగా వ్యవహరించిన బెండ రమేష్ గారు
మొదటి విజేత రాయల్ స్ట్రైకర్స్ జట్టుకు రూ.10,000
రెండవ బహుమతిగా సుప్రీమ్ టైగర్స్ జట్టుకు రూ.5,000
ప్రైజ్ మనీ అందజేశారు.ఈ టోర్నమెంట్ గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించిందని గ్రామస్తులు అభినందించారు.