manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:51 pm Editor : Mana Praja Prathinidhi

జంగంరెడ్డి పల్లెలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర-ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు

మనప్రజాప్రతినిధి/మనకొండూరు.జనవరి17
ఇల్లంతకుంట మండలంలోని జంగం రెడ్డి పల్లె గ్రామంలో నిర్వహించిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఘనంగా జరిగిన ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవాలలో భాగంగా
🔹 మొదటి రోజు శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం
🔹 రెండవ రోజు బండ్ల ప్రదక్షిణ
🔹 మూడవ రోజు రథ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు.
ఈ జాతరకు ఇల్లంతకుంట మండలంతో పాటు పరిసర గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.జాతర చివరి రోజు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేకంగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పండుగ సునీత, తిరుపతి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ,
“ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని శ్రీ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను” అని తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.