కొండపాక (మనప్రజాప్రతినిధి):
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట మాజీ మంత్రి హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్రలను సుప్రీంకోర్టు తుడిచిపెట్టిందని, ఈ తీర్పు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాభవంగా మారిందని బీఆర్‌ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మండిపడ్డారు.ప్రజల సమస్యలపై నిరంతరం గొంతెత్తుతున్న హరీష్ రావుపై అక్కసుతో అక్రమ కేసులు పెట్టారని విమర్శించిన ఆయన, హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాకు తెరలేపిందన్నారు. కానీ న్యాయస్థానం ముందు కాంగ్రెస్ ప్రభుత్వ దురుద్దేశాలు బట్టబయలయ్యాయని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని, ధర్మం నిలిచిందని నూనె కుమార్ పేర్కొన్నారు. హరీష్ రావుపై తప్పుడు కేసులు పెట్టడం మానేసి, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు.
హామీల అమలులో విఫలమైతే, ప్రజల మనిషి హరీష్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన వెనుకడుగు వేయదని నూనెకుమార్ యాదవ్ హెచ్చరించారు.