సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలకు చెక్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘన పరాభవం  నూనె కుమార్ యాదవ్

కొండపాక (మనప్రజాప్రతినిధి): ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట మాజీ మంత్రి హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్రలను సుప్రీంకోర్టు తుడిచిపెట్టిందని, ఈ తీర్పు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాభవంగా మారిందని బీఆర్‌ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మండిపడ్డారు.ప్రజల సమస్యలపై నిరంతరం గొంతెత్తుతున్న హరీష్ రావుపై అక్కసుతో అక్రమ కేసులు పెట్టారని విమర్శించిన ఆయన, హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాకు తెరలేపిందన్నారు....