manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 10:31 am Editor : Mana Praja Prathinidhi

టిడిఏ 2026 క్యాలెండర్ ఘన ఆవిష్కరణ

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి12

తెలంగాణ డయాగ్నస్టిక్స్ అసోసియేషన్ (టిడిఏ)2026 సంవత్సరా నికి సంబంధించిన కాల నిర్ణయ పట్టిక (క్యాలెండర్) ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ దామోదర రాజనర్సింహచేతుల మీదుగా బంజారా హిల్స్‌లోని తమ మంత్రుల నివాస గృహంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిఏ రాష్ట్ర అధ్యక్షులు మట్టిపల్లి రమేష్ పాల్గొని, టిడిఎ చేపడుతున్న కార్యక్రమాలు, డయాగ్నస్టిక్ రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.ఈ కార్యక్రమంలో టిడిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్ల హనుమంతు సహా సిద్దిపేట జిల్లా డయాగ్నస్టిక్ అసోసియేషన్‌కు చెందిన శనిగరం తిరుపతి, సత్యం, శనిగరం క్రాంతికుమార్, ఆంజనేయులు, రమేష్, రాజలింగం, పృద్వి నాయక్, శ్రీనివాస్, నర్సిములు… తదితరులు పాల్గొన్నారు.