అక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీయూడబ్ల్యూజే హర్షం..
•నియోజకవర్గ స్థాయి,కేబుల్ ఛానల్ రిపోర్టర్లకూ న్యాయం చేయాలి :జిల్లా అధ్యక్షులు లాయక్ పాషామనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి26తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్–103పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ.. గతంలో విడుదల చేసిన జీవో నెంబర్–252పై టీయూడబ్ల్యూజే చేపట్టిన ఉద్యమాల ఫలితంగా జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం అభినందనీయ మన్నారు. సమాచార...