సిరిసిల్లలో వైభవంగా శ్రీ రేణుకా మాత-జమదగ్నిల కళ్యాణమహోత్సవం…
•మాఘఅమావాస్య సందర్భంగా కన్నుల పండువగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం. •భక్తులు భారీగా పాల్గొన్న శ్రీ ఎల్లమ్మ ఆలయ కళ్యాణ వేడుకలు...•అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు శుభఫలితాలు కలగాలని ఆకాంక్ష.. మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల పట్టణం 12వ వార్డు పరిధిలోని చంద్రంపేటలో వెలసిన శ్రీ ఎల్లమ్మ (శ్రీ రేణుకా మాత) ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా మాత-జమదగ్నిల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగానిర్వహించారు.భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....