manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 3:34 am Posted by : Mana Praja Prathinidhi

మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో దుద్దెడ యువత ఘన విజయం

గెలుపు–ఓటములు సహజమే: అనంతుల ప్రశాంత్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి21
కొండపాక గ్రామంలో అనంతుల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ ఎంపీపీ అనంతుల శారద జ్ఞాపకార్థంగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. గత 15 రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో కొండపాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి.ఫైనల్‌కు చేరిన కొండపాక, దుద్దెడ జట్లు ఉత్కంఠభరితంగా తలపడగా, దుద్దెడ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన దుద్దెడ జట్టుకు రూ.50,000 నగదు బహుమతితో పాటు కప్పును, రెండవ స్థానంలో నిలిచిన కొండపాక జట్టుకు రూ.25,000 నగదు బహుమతితో పాటు బహుమతి టోపీని ట్రస్ట్ చైర్మన్ అనంతుల ప్రశాంత్ అందజేశారు.ఈ సందర్భంగా అనంతుల ప్రశాంత్ మాట్లాడుతూ, “క్రీడల్లో గెలుపు–ఓటములు సహజం. ఓటమితో కుంగిపోకుండా భవిష్యత్తులో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీల్లో యువత మరింతఉత్సాహంగా పాల్గొనాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.