మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో దుద్దెడ యువత ఘన విజయం

గెలుపు–ఓటములు సహజమే: అనంతుల ప్రశాంత్మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి21కొండపాక గ్రామంలో అనంతుల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ ఎంపీపీ అనంతుల శారద జ్ఞాపకార్థంగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. గత 15 రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో కొండపాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి.ఫైనల్‌కు చేరిన కొండపాక, దుద్దెడ జట్లు ఉత్కంఠభరితంగా తలపడగా, దుద్దెడ జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన దుద్దెడ జట్టుకు రూ.50,000 నగదు బహుమతితో పాటు కప్పును, రెండవ స్థానంలో...