యువత చదువు–క్రీడల్లో సమతుల్యత సాధించాలి:గ్రామసర్పంచ్ శివకుమార్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి19క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహభావం పెరుగుతుందిసిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో స్వర్గీయ ఉనుగూరి సత్తయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉనుగూరి జైపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుద్దెడ గ్రామస్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత సెల్‌ఫోన్లకు బానిసలవుతున్న ఈ తరుణంలో క్రీడలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, స్నేహభావం...