పీపీపీ విధానాలతో ప్రజా వైద్యాన్ని నాశనం చేస్తున్నారు…
గుంటూరు జనవరి 7 (మన ప్రజా ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యలను విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నట్టు వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులపై కనీసం మాట్లాడే స్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం బాధాకరమన్నారు.ఎన్నికల ముందు పేదవారికి, అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన వెంటనే “ఏరు దాటిన తర్వాత తెప్ప తెగిలేసినట్టు”...