సమయం విలువైనది… ప్రణాళికాబద్ధంగా చదివితేనే విజయం
•నేటినుంచి ఇంటర్ ప్రీ–ఫైనల్ పరీక్షలు•జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి మనప్రజాప్రతినిధి//సిద్దిపేట జిల్లా.జనవరి3పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా సీరియస్‌గా చదువుపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం నుంచి జిల్లాలో ప్రీ–ఫైనల్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా తప్పనిసరిగా పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియే షన్ నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు...