సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ కు తొగుట సీఐ షేక్ లతీఫ్
(మనప్రజాప్రతినిధి//జనవరి 30): రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్‌ను కోకో, కబడ్డీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ లతీఫ్ హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాయపోల్ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు...