manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 10:53 am Editor : Mana Praja Prathinidhi

టీపీయూఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ<br>ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రకటించాలి : టీపీయూఎస్ డిమాండ్

ఉపాధ్యాయుల హక్కుల కోసం టీపీయూఎస్ గళం
•క్యాలెండర్ ఆవిష్కరణ వేదికగా ఉపాధ్యాయ సమస్యల ప్రస్తావన
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లిమండలం.జనవరి29
అక్బర్ పేట్ భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ కాంప్లెక్స్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) క్యాలెండర్‌ను మండల ఏంఈఓ అంజయ్య గౌడ్.చిట్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు బాలకిషన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టీపీయూఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, అలాగే ఉపాధ్యాయుల పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయు ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జనరల్ సెక్రెటరీ బాలరాజు, సభ్యులు పెద్ది కుమార్, ప్రసాద్, స్వామి, సంధ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు పాల్గొని సంఘీభావం తెలిపారు.