ఇంటర్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత అవసరం
•సీనియారిటీ ప్రాతిపదికన విధులు కేటాయించాలి : జీజేఎల్ఏసిద్దిపేటనియోజకవర్గం(మనప్రజాప్రతినిధి):జనవరి5ఇంటర్మీడియట్ వార్షిక ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం అధ్యాపకులకు పరీక్షల విధులను సీనియారిటీ ఆధారంగా కేటాయించాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) జిల్లా అధ్యక్షుడు ఏడబోయిన సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డీఐఈఓను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలు సజావుగా జరిగేలా తమ సంఘం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని,...