manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 11:01 am Editor : Mana Praja Prathinidhi

కేంద్రమంత్రి బండిసంజయ్ కుమార్‌కు ఘన స్వాగతం

•వీరభద్ర స్వామిదర్శనానికి వెళ్తున్నసందర్భంగాహుస్నాబాద్ బీజేపీ నాయకుల సన్మానం

హుస్నాబాద్//మనప్రజాప్రతినిధిజనవరి13 :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ కొత్త కొండ వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా, హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, పట్టణ నాయకులతో కలిసి కేంద్ర మంత్రిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, వేల్పుల నాగార్జున్,ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్,కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య,బొప్పిశెట్టి సాయిరామ్,కోశాధికారి బుర్ర రాజు,శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్,బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, తోట సమ్మయ్య, కాయిత అరుణ్ రెడ్డి, వరియోగుల అనంతస్వామి, ఆశాడపు శ్రీనివాస్,తదితర బీజేపీ నాయకులు దొంతరబోయిన సాంబరాజు పాల్గొన్నారు.