manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 6:55 am Posted by : Mana Praja Prathinidhi

సంతాన మల్లికార్జున సమేత విజయదుర్గ దేవి కాలమానిని ఆవిష్కరణ

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:

మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురువారం నాడు 2026 కాలమానిని క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆవిష్కరించారు క్షేత్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల వివరాలతో దీనిని రూపొందించినట్లు ఆయన తెలిపారు.క్షేత్రఃలో ప్రతి శుక్రవారం రాహు,కేతు దోష నివారణ,కుజదోష నివారణ కోసం రాహుకాలంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని,ఆర్ద్రా నక్షత్రం రోజున ప్రతినెలా సంతాన పాశుపత హవనం,పౌర్ణమి నాడు నవావరణ హవనం మాస్ శివరాత్రిని పురస్కరించుకుని ప్రతినెలా సంతాన మల్లికార్జున స్వామికి అన్న పూజ నిర్వహిస్తామన్నారు.శివరాత్రికి మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.కార్తీక శుద్ధ సప్తమి రోజున శ్రీ విజయదుర్గా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం,వసంత పంచమి పర్వదినాన అమ్మవారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల‌ వివరాలతో కాలమానిని రూపొందించామన్నారు.కార్యక్రమంలో మర్పడగ గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు,రాంపల్లి గ్రామ సర్పంచ్ మల్లేశం,మాజీ సర్పంచులు రమణారెడ్డి,సురేందర్ రెడ్డి క్షేత్ర నిర్వాహణా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల భక్తులు క్షేత్రాన్ని సందర్శించడం తో క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిట లాడింది.భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.