వేములవాడ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్‌కు ఇండియన్ పోలీస్ మెడల్
•41 ఏళ్ల నిర్విరామ సేవలకు జాతీయ స్థాయి గౌరవంమనప్రజాప్రతినిధి//వేములవాడ.జనవరి27కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) కు వేములవాడ పట్టణ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ బుర్ర ఎల్లయ్య గౌడ్ ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన 41 సంవత్సరాల అంకితభావ, సాహసోపేత సేవలను గుర్తిస్తూ ఈ అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.1985లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన ఎల్లయ్య గౌడ్, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు పొందారు. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా...