manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 10:00 am Posted by : Mana Praja Prathinidhi

అన్నారం గ్రామంలో విలేజ్ లెవల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్యాంప్

•PMJJBY ద్వారా మృతురాలి భర్తకు రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా-పాపన్నపేట్.జనవరి17
పాపన్నపేట్ మండలంలోని అన్నారం గ్రామంలో ఆర్బీఐ వీఐడ్స్ CFL కౌన్సిలర్స్ – హవేలీ ఘన్పూర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం విలేజ్ లెవల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సంబంధిత అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్, సైబర్ క్రైమ్ నివారణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.కార్యక్రమాంతరం అన్నారం గ్రామానికి చెందిన నల్లోల్ల పోచమ్మ గత సంవత్సరం తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ – యూసుఫ్‌పేట బ్రాంచ్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో చేరి, సంవత్సరానికి కేవలం రూ.436 ప్రీమియం చెల్లించిన విషయం గుర్తు చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, PMJJBY పథకం ద్వారా రూ.2 లక్షల బీమా మొత్తం మంజూరయ్యింది.ఈ బీమా చెక్కును మృతురాలి నామినీ అయిన భర్త నల్లోల్ల అమృతి గారికి గ్రామ సర్పంచ్ రాణి సుదీర్ గారు మరియు TGB యూసుఫ్‌పేట బ్రాంచ్ మేనేజర్ సంతోష్ సార్ చేతుల మీదుగా అందజేశారు.
ఈకార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ రాణి సుదీర్ గారు,తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ యూసుఫ్‌పేట బ్రాంచ్ మేనేజర్ సంతోష్ సార్,RBI Vids CFL కౌన్సిలర్స్ కె. నరేష్ కుమార్, బి. నరేష్, టి. వంశీ,ఉప సర్పంచ్ గారు,ఐరిక్స్ ఛానల్ మేనేజర్ అశోక్ సార్,బ్యాంకు మిత్రలు స్వాతి, అచలం, నాగమణి,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.