కొలనూర్ దుర్గమ్మ ఆలయం సమీపంలో వైన్ షాప్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన

•ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రంమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.జనవరి12కొనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో ఉన్న గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయానికి అతి సమీపంలో ఇటీవల టెండర్ దక్కించుకున్న వైన్ షాప్ నిర్వాహకులు మద్యం దుకాణం ఏర్పాటు కోసం గదుల నిర్మాణ పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆందోళ న వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ పరిసరాల్లో...