manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:38 pm Posted by : MANA PRAJA PRATINIDHI

13వ వార్డుకు వివేకానంద నామినేషన్ దాఖలు

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29:

ఖేడ్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కౌన్సిలర్ స్థానానికి మాజీ కౌన్సిలర్ వివేకానంద గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు వార్డు ప్రజలు తనను కౌన్సిలర్ గా గెలిపించాలని,ఎంపి సురేష్ శెట్కార్,ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను అన్నారు.మరొక్కసారి అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తాను అన్నారు.