manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 4:00 pm Editor : Mana Praja Prathinidhi

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సదాశివపేట,జనవరి5(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 26 వార్డుల నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారం లేకపోయినా అధైర్య పడాల్సిన అవసరం లేదని, రానున్నది మళ్లీ బీఆర్ఎస్. ప్రభుత్వ మేనని ధీమా వ్యక్తం చేశారు.రిజర్వేషన్ ఏదైనా సరే పార్టీ శ్రేణులు ఐక్యంగా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, కొత్త గొల్ల కృష్ణా, కోడూరు అంజయ్య, కోడూరు రమేష్, పట్టణ వార్డు ముఖ్యులు,మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.