మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సదాశివపేట,జనవరి5(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 26 వార్డుల నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం...