ఉద్యమ కళాకారుల హక్కుల కోసం కాంగ్రెస్‌ను నిలదీయాలి: బొల్లం రాజేష్

•ఎన్నికల హామీలను విస్మరించిన రేవంత్ ప్రభుత్వం-ఈనెల 20న •హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్యమకళాకారుల పోరుదీక్షసిద్దిపేట,జనవరి18(మనప్రజాప్రతినిధి):తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమ కళాకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు.ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఉద్యమ కళాకారులు తమ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్థిత్వాన్ని పల్లె...