సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం
- రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం- బీజేపీకి షాక్… బీఆర్‌ఎస్‌లో చేరిన పత్రి శ్రీనివాస్సిద్దిపేట, జనవరి 9 (మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామనే కుట్రలను సహించబోమని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేటలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ నాయకుడు హనుమంత్ రావు తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....