హోం గార్డ్ దేవయ్య కుటుంబానికి అండగా ఉంటాం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేమనప్రజాప్రతినిధి/రాజన్న సిరిసిల్లజనవరి, 06జిల్లా పోలీసు శాఖలో 26 ఏళ్లుగా విశిష్ట సేవలు అందించిన హోం గార్డ్ దేవయ్య మరణం పోలీసు వ్యవస్థకు తీరని లోటని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని క్రషర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవయ్య ప్రాణాలు కోల్పోయారు.అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్పీమంగళవారం జరిగిన దేవయ్య అంత్యక్రియల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల...