manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:41 pm Editor : Mana Praja Prathinidhi

డ్రైవింగ్‌లో సీట్ బెల్ట్ తప్పనిసరి-జిల్లా రవాణా శాఖ హెచ్చరిక

రాజన్న సిరిసిల్ల,జనవరి2(మనప్రజాప్రతినిధి)
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖశుక్రవారం వేములవాడ కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ డ్రైవింగ్‌లో సీట్ బెల్ట్ తప్పనిసరి అని అందరికి సూచించారు.అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ముఖ్యంగా:కార్ల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి.మద్యం తాగి వాహనం నడపరాదు.రాంగ్ రూట్‌లో వెళ్లకూడదు.డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించ కూడదు.వాహనాన్ని రివర్స్‌లో తీసేప్పుడు వెనుక కింద గమనించాలి.
వేగం నియంత్రణలో ఉండాలి.ఈ కార్యక్రమంలో సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేయబడింది. సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు దాని ప్రాముఖ్యత వివరించారు. అదనంగా వాహనాలకు భద్రతా స్టిక్కర్లు కూడా అతికరించారు.
వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ కూడా చేశారు.కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్‌ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.